ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి శరీరాన్ని ముక్కలుగా నరికిన తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి, ఆమె శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  6 March 2025 9:17 PM IST
ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి శరీరాన్ని ముక్కలుగా నరికిన తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి, ఆమె శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన కూతురు తన పొరుగువారి ఇంటికి వెళ్లిందనే కోపంతో నిందితుడు మోహిత్ మిశ్రా బాలికను కిరాతకంగా చంపేశాడు. మోహిత్ పొరుగింటి వారితో గతంలో గొడవ పడ్డాడు, వాళ్ల ఇంటికి తన కుమార్తె వెళ్లడం నచ్చక మోహిత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 25న చిన్నారి తప్పిపోయిందని మిశ్రా స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆమెకు సంబంధించిన ఒక శరీర భాగాన్ని మొదట కనుగొన్నాము. మరుసటి రోజు, ఆమె హత్యకు గురైందని నిర్ధారిస్తూ మరిన్ని అవశేషాలు లభించాయని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ రంజన్ సింగ్ చెప్పారు. దర్యాప్తు సమయంలో బాలిక తండ్రి కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. పోలీసులు విచారించగా చివరికి అతను బాలికను చంపి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Next Story