కూతుళ్ల‌పై తండ్రి పదే పదే అత్యాచారం.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Father jailed for raping minor daughters. 2018లో తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో నేపాలీ చెందిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లోని స్థానిక కోర్టు

By అంజి  Published on  10 Nov 2021 4:03 PM IST
కూతుళ్ల‌పై తండ్రి పదే పదే అత్యాచారం.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

2018లో తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో నేపాలీ చెందిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లోని స్థానిక కోర్టు ఇవాళ 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతనికి రూ.10,000 జరిమానా విధించింది. బాధితులకు రూ.6 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణలో తండ్రి తన కూతుళ్లపై ఎన్నో సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే.. బాధితులు 17, 8 సంవత్సరాల వయస్సు గలవారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు బాలికలు చదువుతుండేవారు. ఈ క్రమంలోనే వాచ్‌మెన్‌గా పనిచేసే తండ్రి వారిపై పదేపదే అత్యాచారం చేశాడు. ఈ ఘటన 2018లో బాలికలు తమ బంధువులతో పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా రాజీవ్‌ గాంధీ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌ పోర్టు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.

Next Story