కోడలిపై సొంత మామ అత్యాచారం

Father-in-law raped his daughter-in-law. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఓ వృద్ధుడిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి.

By Medi Samrat  Published on  3 April 2022 12:31 PM GMT
కోడలిపై సొంత మామ అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఓ వృద్ధుడిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. తన సొంత మామ అత్యాచారం చేశాడని కోడలు ఆరోపించింది. బాధితురాలు తన మామపై కేసు నమోదు చేసేందుకు దామోహ్ పట్టణంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు అర్థరాత్రి చేరుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ సుష్మా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. పెళ్లయిన ఏడాది వరకు అంతా బాగానే సాగింది. కొన్ని రోజుల తర్వాత మామ తనను వేధించడం ప్రారంభించాడని, ఓ రోజు ఆమెపైపై అత్యాచారం చేశాడని" తెలిపారు.

ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు కూడా చెప్పగా, భర్త అసలు పట్టించుకోలేదు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసు నమోదు చేసింది. ఈ మేరకు పోలీసులు మహిళా పోలీస్ స్టేషన్‌లో సదరు మామపై కేసు నమోదు చేశారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఎచ్ఓ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it