జగిత్యాలలో దారుణం.. మంత్రాల నెపంతో.. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య

Father and two sons who were brutally murdered in Jagtial. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు

By అంజి  Published on  20 Jan 2022 10:12 AM GMT
జగిత్యాలలో దారుణం.. మంత్రాల నెపంతో.. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన తారకరామ నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా బుధవారం ఉదయం కుల సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హత్యకు గురైన వారిపై ప్రత్యర్థులు చేతబడి నెపం మోపినట్లు తెలుస్తోంది. మంత్రాలు వేసి పలువురిని అనారోగ్యాలకు గురి చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ ఘటనలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి వచ్చారు. అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను తండ్రి నాగేశ్వరరావు, కుమారులు రాంబాబు, రమేష్‌గా పోలీసులు గుర్తించారు. జగిత్యాల పట్టణంలో ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురికావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి విచారణ సాగుతోంది.

Next Story
Share it