ఒకే కుటుంబంలోని నలుగురి హత్య.. సంచలన విషయాలు బయటకు..
Family Of 4 Murdered In UP's Prayagraj. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని
By Medi Samrat Published on 26 Nov 2021 5:13 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు హత్యకు గురయ్యారు. చనిపోయిన వారిలో 16 ఏళ్ల అమ్మాయి, పదేళ్ల అబ్బాయి ఉన్నారు. హత్యకు ముందు బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని దళిత ఫ్యామిలీగా గుర్తించారు. 11 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, హత్య కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డారని.. బాధితుల ఒంటిపై అత్యంత తీవ్రమైన గాయాలున్నాయన్నారు.
అమ్మాయి మృతదేహం గదిలో కనిపించిందని, మిగతా ముగ్గురి మృతదేహాలు పెరట్లో పడేశారని తెలుస్తోంది. 2019 నుంచి ఓ అగ్రకులానికి చెందిన కుటుంబంతో భూ తగాదాలు నడుస్తున్నాయని.. సెప్టెంబర్ లో కూడా దాడికి పాల్పడ్డారని, వారే ఈ హత్యలు చేసి ఉండొచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసుపై రాజీ కుదిర్చేందుకు పోలీసులు బలవంతం చేస్తున్నారని, నిందితుల ఇంటికి పోలీసులు వెళ్తున్నారని ఆరోపించారు. తాజాగా ఘటనపై ప్రయాగ్ రాజ్ పోలీస్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పందించారు.
నలుగురి తలలపై గొడ్డలి వేటుతో హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. అంతకుముందు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చెప్పారు. ఉదయం వారి ఇంట్లో 50 ఏళ్ల వ్యక్తి, అతని 45 ఏళ్ల భార్య, వారి పిల్లల మృతదేహాలు లభ్యమైన వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లోని ఫఫమౌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. నలుగురినీ పదునైన ఆయుధంతో నరికి చంపారు. మృతుల్లో ఫూల్‌చంద్, అతని భార్య మీను, కుమార్తె సప్న, కుమారుడు శివ ఉన్నారు.
హత్య సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక గదిలో మూడు మృతదేహాలు, మరో గదిలో బాలిక మృతదేహం ఉన్నట్లు ఎస్‌ఎస్పీ ప్రయాగ్‌రాజ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కుటుంబ సభ్యులందరినీ తలపై వేటు వేసి హతమార్చినట్లు తెలుస్తోందని అన్నారు. సుశీల్ కుమార్ అనే వ్యక్తితో ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని, గతంలో కూడా తమపై పలుమార్లు దాడి చేశారని మృతుడి ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.