ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ కూతురికి కాసేప‌ట్లో అంత్య‌క్రియ‌లు.. సూసైడ్ నోట్‌లో సంచ‌ల‌న విష‌యాలు

Family members preparing for funeral after girl's suicide. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో షాకింగ్ కేసు నమోదైంది. గ్యాంగ్ రేప్‌లో గాయపడిన

By Medi Samrat  Published on  29 Dec 2021 1:27 PM GMT
ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ కూతురికి కాసేప‌ట్లో అంత్య‌క్రియ‌లు.. సూసైడ్ నోట్‌లో సంచ‌ల‌న విష‌యాలు

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో షాకింగ్ కేసు నమోదైంది. గ్యాంగ్ రేప్‌లో గాయపడిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక పరువు పోతుందనే భయంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. బాలిక అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అత్యాచారం జరిగిన విషయం బాధితురాలి కుటుంబీకులకు తెలిసింది. మృతురాలి దుస్తులలో సూసైడ్ నోట్ దొర‌క‌క‌గా.. అందులో ఆమె మరణానికి గ‌ల‌ కారణాన్ని వెల్లడించింది.

బాధితురాలు రాసిన లేఖలో.. 'నేను చనిపోతున్నా.. నా వస్తువులు ఎవరికీ ఇవ్వకండి. నాకు చావాలని లేదు.. కానీ నేను ఏమి చేయను? ప్రజలు నా తండ్రిని నిందిస్తారు. నా కలలు ఇప్పటికీ నెరవేరలేదు. మహేంద్ర, అతని స్నేహితుడు నన్ను మోసపూరిత బుద్ధితో పిలిచారు. నాకు చెడ్డ పేరు వచ్చింది. మా అమ్మా నాన్నలకు ఏమీ చెప్పకు. నాన్న, నన్ను క్షమించండి. నా బట్టలు, అన్ని వస్తువులను సరైన స్థలంలో ఉంచండి. నేనేమీ తప్పు చేయలేదు.' మృతురాలు మరోసారి నోట్‌లో 'నాన్న, అమ్మ నన్ను క్షమించండి.. ఇట్లు మీ కూతురు. నా చావుకి మహేంద్ర, అతని స్నేహితుడే కారణం అని రాసింది

సూసైడ్ నోట్ చదివి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇద్దరు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టంతో సహా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు మృతురాలి అత్తకు స్నేహితుడు. సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి ఇద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మైనర్‌పై మహేంద్ర సింగ్ (24), స్నేహితుడితో క‌లిసి అత్యాచారం చేశారు. బాధితురాలిని విష‌యం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని బెదిరించాడని పేర్కొన్నారు.


Next Story
Share it