ఒడిస్సా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని పట్టాంగి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న మూఠాను పోలీసులు అరెస్తు చేశారు. వారి వద్ద నుండి సుమారు 8 కోట్ల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సునాబేదా ఎస్‌డిపిఓ నిరంజన్ బెహెరా తెలిపారు. వాహనంలోని నోట్లన్నీ నకిలీ 500 రూపాయలు అని చెప్పారు.
వాహానాల తనిఖీల్లో భాగంగా కోరాపుట్ పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు రూ .7.9 కోట్ల విలువైన నకిలీ నోట్లు దొరికాయి తెలిపారు. తనిఖీ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు ఛత్తీస్‌గడ్ లోని రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నంకు వెళ్తున్నట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్ లలో ఈ నకిలీ నోట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. వీరంతా ఛత్తీస్‌గడ్ లోని జంజాగిర్‌లోని చంపా జిల్లాకు చెందినవారని.. వారి వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లు, రూ .35,000 నగదు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఐడి ప్రూఫ్‌లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.