వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవవధువుపై
By Medi Samrat Published on 30 Aug 2023 8:17 PM ISTహైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని బండ్లగూడలోని ఓ బాబా దగ్గరికి అత్తమామలు తీసుకెళ్లారు. నవవధువు కళ్లకు గంతలు కట్టిన బాబా గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బాధితురాలు అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదట. దెయ్యం పట్టింది అంటూ ఆమెను ఇంట్లోనే బంధించారు. అనంతరం తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందని భవానీనగర్ పోలీసులు వారిని అక్కడికి పంపారు. పోలీసులు తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం బయటకు తెలియడంతో దొంగ బాబా పరారయ్యాడు.
ఓ నవవధువుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమె అత్తామామలు ఆమెను బాబా దగ్గరికి తీసుకెళ్లారు. అయితే నవవధువు పై కన్నేసిన ఆ దొంగ బాబా వాళ్ల అత్తమామలకు మాయమాటలు చెప్పి ట్రీట్మెంట్ పేరుతో పక్క గదిలోకి తీసుకొని వెళ్లాడు. అక్కడ నవవధువు కళ్లకు గంతలు కట్టి ఆమె పై దారుణానికి ఒడిగట్టాడు.