వరుసగా రెండో రోజు ఎన్‌కౌంటర్..!

Encounter in Azamgarh for second consecutive day. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో వరుసగా రెండో రోజు కూడా పోలీసులు, దుండగులకు మధ్య

By Medi Samrat  Published on  18 March 2022 10:42 AM GMT
వరుసగా రెండో రోజు ఎన్‌కౌంటర్..!

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో వరుసగా రెండో రోజు కూడా పోలీసులు, దుండగులకు మధ్య కాల్పులు జ‌రిగాయి. అంతేకాకుండా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ సమయంలోనే ఓ గూండా ఓ ఇంట్లో దాక్కున్నాడు. పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ఇక అవకాశం లేకపోవడంతో పోలీసులు అతడిని కాల్చవలసి వచ్చింది. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. అంతకుముందు, గే డేటింగ్ యాప్ ద్వారా వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని, వారిని నిర్జన ప్రదేశానికి పిలిపించి దోచుకున్న ముఠాలోని ఓ దుండగుడిని కాల్చారు పోలీసులు.

బుధవారం సాయంత్రం 4 గంటలకు భాడో టర్న్ సమీపంలో సోదాల సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు పోలీసులను చూసి పారిపోడానికి ప్రయత్నించినట్లు బర్దా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర కుమార్ తెలిపారు. వెనుక కూర్చున్న దుండగుడు కాల్పులు జరుపుతూ ఉండగా అక్కడి నుండి పారిపోయారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. అతని సహచరులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బర్రా గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు.

పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు గాయపడ్డాడు. గాయపడిన వెంటనే పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్‌ను మెహనాజ్‌పూర్‌లో నివాసముంటున్న సందీప్‌ కుమారుడు దులార్‌గా గుర్తించారు. గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.Next Story
Share it