తమ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో నివాసం ఉంటున్న యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్‌లో కొందరికి గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. డి.రాజు, సంజన దంపతుల నుంచి దాదాపు ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, సంజన మధ్యప్రదేశ్‌కు చెందినదని అధికారులు తెలిపారు.
బతుకుదెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన రాజు కొన్ని నెలల పాటు ఎడ్యుకేషన్ స్టార్టప్‌లో మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత హోటల్‌లో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. మూడు నెలల క్రితం సంజన కూడా ఇంటి నుంచి పారిపోయి ఓ లాడ్జిలో నివాసం ఉంటూ అక్కడ గంజాయి వ్యాపారం చేస్తూ వచ్చారు. సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి నేతృత్వంలోని ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) లాడ్జిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకుంది.