కూరగాయలు తీసుకురమ్మన్న భార్య.. భ‌ర్త ఏం చేశాడంటే..

Drunk man drags wife by hair. కూరగాయలు తీసుకురమ్మని అడిగినందుకు.. భార్యను చితక్కొట్టాడు ఆ భర్త.

By Medi Samrat  Published on  20 Aug 2022 2:09 PM IST
కూరగాయలు తీసుకురమ్మన్న భార్య.. భ‌ర్త ఏం చేశాడంటే..

కూరగాయలు తీసుకురమ్మని అడిగినందుకు.. భార్యను చితక్కొట్టాడు ఆ భర్త. మత్తులో ఉన్న అతడు.. తన భార్యను రోడ్డుపైకి లాగి, దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కేవీ నగర్ పోలీస్ స్టేషన్‌లోని మహేంద్ర ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆరోహి మిశ్రా అనే బాధితురాలు మాట్లాడుతూ.. "నా భర్త తాగిన స్థితిలో ఇంటికి వచ్చాడు, నేను పని చేసి అలసిపోయాను, బయటకు వెళ్లి కూరగాయలు తీసుకురావాలని అడిగాను, కానీ అతను కోపంతో నన్ను కొట్టడం ప్రారంభించాడు." అని చెప్పుకొచ్చింది.

"నన్ను రక్షించుకోవడానికి నేను ఇంటి నుండి బయటకు పరిగెత్తాను, వెంబడించి మరీ వీధిలో నన్ను కొట్టాడు, నా జుట్టు పట్టుకుని ఈడ్చాడు", అని ఆరోహి చెప్పింది. ఆమె 112 డయల్ చేయడానికి ప్రయత్నించగా.. భర్త ఫోన్ ను లాక్కుని మరీ ఆమెను చితక్కొట్టాడు.

స్థానికంగా ఉంటున్న శివ అనే వ్యక్తి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడు సౌరవ్ మిశ్రా తన మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి శివను కొట్టాడని ఎస్పీ ఘజియాబాద్, నిపున్ అగర్వాల్ తెలిపారు. శివ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మిశ్రాతో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆరోహి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 45 సెకన్ల నిడివి గల వీడియోలో, ఆ మహిళ రోడ్డుపై పరుగెత్తుతుండగా, ఆమె భర్త ఆమెను వెనుక నుండి వెంబడించడం మనం చూడవచ్చు. తర్వాత ఆమెను రోడ్డుపైకి తోసేసి, జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టాడు.




Next Story