మధ్యప్రదేశ్‌లో ఓ ప్రిన్సిపాల్‌.. విద్యార్థినిల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించాడు. మద్యంతో విద్యార్థినిలను డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతం పెట్టాడు. అనంతరం ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దమెహ్‌ జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధియదో గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా రాజేశ్‌ ముండా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపాల్‌.. తరగతి గదిలోని విద్యార్థినిలను డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతం చేశాడు.

ఆ తర్వాత విద్యార్థినిలు డ్యాన్స్‌ చేస్తుండగా ఆ వీడియోను చిత్రీకరించాడు. ఈ ఘటనపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ప్రిన్సిపాల్‌ రాజేశ్‌ ముండాను సస్పెండ్‌ చేశారు. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందినట్లు డీఈవో ఎస్‌.కె.మిశ్రా తెలిపారు. కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ కృష్ణ చైత్యన నివేదిక ఆధారంగా సస్పెన్సన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రిన్సిపాల్‌ను పతేరా బ్లాక్‌ ఆఫీసుకు అటాచ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

" పాఠశాలలోని ఒక గదిని లోపలి నుండి బోల్ట్ చేసిన తర్వాత మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడు రాజేష్ ముండా తనతో కలిసి నృత్యం చేయమని బాలికల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతను డ్యాన్స్ వీడియోను కూడా చిత్రీకరించాడు, "అని జిల్లా విద్యా అధికారి ఎస్‌కె మిశ్రా తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story