త‌ప్ప‌తాగి ప్రాణాలు తీశాడు.. కారు నుండి బయటకొచ్చి 'వన్ మోర్ రౌండ్' అంటూ..!

గుజరాత్‌లోని వడోదరలో 20 ఏళ్ల వ్యక్తి తన కారుతో నలుగురిని ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా

By Medi Samrat  Published on  14 March 2025 5:22 PM IST
త‌ప్ప‌తాగి ప్రాణాలు తీశాడు.. కారు నుండి బయటకొచ్చి వన్ మోర్ రౌండ్ అంటూ..!

గుజరాత్‌లోని వడోదరలో 20 ఏళ్ల వ్యక్తి తన కారుతో నలుగురిని ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మద్యం తాగిన డ్రైవర్ ప్రమాదం తర్వాత కారు నుండి బయటకు వచ్చి "మరో రౌండ్" అని అరుస్తున్నట్లు చూడొచ్చు. అతడు డ్రైవ్ చేస్తూ వాహనాలను ఢీకొట్టగా అక్కడ ఆయా వ్యక్తులు కింద పడి ఉన్నారు.

గురువారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో కరేలిబాగ్ ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి రక్షిత్ చౌరాసియాను అరెస్టు చేశారు. అతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నివాసి, వడోదరలోని ఒక విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. ఈ కేసులో రెండవ నిందితుడు, కారు యజమాని ప్రమాదం జరిగిన సమయంలో చౌరాసియాతో కలిసి ప్రయాణిస్తున్నాడు, అతన్ని కూడా అరెస్టు చేశారు. అతడిని వడోదరలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న మిత్ చౌహాన్‌గా గుర్తించారు.

ప్రమాద స్థలంలో రికార్డు చేసిన ఫుటేజ్‌లో నిందితుడు నల్లటి టీ-షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి కారు నుండి బయటకు వచ్చాడు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత అతను తన చేతులను గాలిలోకి లేపి "ఇంకో రౌండ్" అని అరవడం ప్రారంభించాడు. కొన్ని సెకన్ల తర్వాత, అతను "ఓం నమః శివాయ్" అని జపించడం ప్రారంభించాడు. డ్రైవింగ్ చేసిన వ్యక్తి బయటకు వచ్చేలోపు సహ ప్రయాణీకుడు కారు వదిలి వ్యతిరేక దిశలో పరిగెత్తాడు.

Next Story