డ్రైవర్ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఆ ఓనర్ భార్య అసలు ఊహించి ఉండదు
Driver, sacked, confesses to killing DU professor’s wife. దేశ రాజధాని ఢిల్లీలో ఓ డ్రైవర్ అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డ్రైవర్ ఉద్యోగం నుంచి
By Medi Samrat Published on 9 Nov 2021 12:48 PM GMT
దేశ రాజధాని ఢిల్లీలో ఓ డ్రైవర్ అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డ్రైవర్ ఉద్యోగం నుంచి అతడిని తొలగించాలని ఓనర్ భార్య చెప్పినందుకు యజమాని భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. మొదట గొంతు నులిమి హతమార్చి ఆపై ఆమె చనిపోయిందో లేదో నిర్ధారించుకునేందుకు కరెంట్ షాక్ ఇచ్చాడు. బురారీ ప్రాంతలోని వెస్ట్‌సంత్ నగర్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో అడ్ హక్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న వీరేందర్ కుమార్ నాలుగేళ్ల క్రితం నిందితుడు రాకేష్ అనే వ్యక్తికి.. తన ఫ్లాట్‌లోనే ఒక ప్రత్యేక గది ఇచ్చి డ్రైవర్‌గా నియమించుకున్నాడు. తనకు నెలనెలా జీతం వద్దని.. అవసరమైతే మొత్తం ఒకేసారి తీసుకుంటానని యజమానితో చెప్పాడు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరేందర్ పింకీ అనే యువతిని పెళ్లిచేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. రాకేష్ ప్రవర్తన పింకీకి నచ్చలేదు. తన భర్తకు చెప్పి కొన్ని నెలల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు గెంటేయించింది. రెండు నెలల ముందు ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. పింకీపై కక్ష పెంచుకున్న రాకేశ్ సోమవారం ఉదయం వీరేందర్ ఆమె తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లాడని తెలుసుకుని.. పింకీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వెళ్ళిపోయాడు. మద్యం సేవించి వెళ్లిన అతడు.. గొంతు నులిమి పింకీని హత్య చేశాడు. ఆ తర్వాత కరెంట్ షాక్ కూడా ఇచ్చాడు. పింకీ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చాడు. తాను పనిచేసిన సమయంలో మొత్తం రూ.3 లక్షల సొమ్ము రావాల్సి ఉందని అవి కూడా ఇవ్వకుండా మోసం చేసినందుకే పింకీని హతమార్చానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.