ఎటు వెళ్తోంది ఈ సమాజం.. ఇంట్లో పని మనిషిని కూడా నమ్మలేమా.?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఓ పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  16 Oct 2024 8:00 PM IST
ఎటు వెళ్తోంది ఈ సమాజం.. ఇంట్లో పని మనిషిని కూడా నమ్మలేమా.?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఓ పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. యజమానుల కోసం చపాతీలు చేస్తూ ఉంటుంది ఆ పని మనిషి. అయితే ఆ పిండిలో మూత్రం కలిపింది. రీనా అనే మహిళను ఆమె యజమాని ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. రీనా పాత్రలో మూత్ర విసర్జన చేసి, ఆపై పిండిలో కలుపుతున్న దృశ్యాన్ని ఫిర్యాదుదారు వీడియో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రీనా తాను చేసిన దారుణమైన పనిని అంగీకరించింది. తన యజమాని ఎప్పుడూ నిశితంగా గమనిస్తూ ఉండేవాడని, చిన్న, చిన్న తప్పుల విషయంలో కూడా తనపై అరుస్తూ ఉంటాడని తెలిపింది. అందుకే కోపం వచ్చి రోటీలు తయారీ చేసే పిండిలో మూత్రం కలిపినట్లు ఒప్పుకుంది. రీనాపై భారతీయ న్యాయ్ సంహిత (బిఎన్ఎస్) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇలాంటి ఘటనలను అరికట్టడానికి, మానవ వ్యర్థాలతో ఆహారాన్ని కలుషితం చేస్తే భారీ జరిమానా విధించే రెండు ఆర్డినెన్స్‌లను తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఆహారంపై ఉమ్మివేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

Next Story