ప్రసవ సమయంలో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వైద్యుడు

Doctor raped women during delivery. ప్రసవ సమయంలో ఓ వైద్యుడు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By Medi Samrat
Published on : 13 July 2022 7:43 PM IST

ప్రసవ సమయంలో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వైద్యుడు

ప్రసవ సమయంలో ఓ వైద్యుడు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అదే రోజు డెలివరీ కోసం వచ్చిన మరో ఇద్దరు మహిళలపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనలపై విచారణ కొనసాగుతోంది. బ్రెజిల్‌లోని రియో ​​డి జెనీరోలో చోటుచేసుకుంది. ద ముల్హర్‌ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. 32 ఏళ్ల డాక్టర్ పేరు గియోవన్నీ క్వింటెలా బెజ్రా. డెలివరీ సమయంలో, మహిళ భర్తను గది నుండి బయటకు వెళ్లమని అడిగినట్లు తెలుస్తోంది.

టెలివిజన్‌లో డాక్టర్‌ అరెస్ట్‌ వార్త చూడగానే సంఘటన గురించి మహిళ భర్తకు తెలిసింది. డాక్టర్ తనపై లైంగిక దాడి చేస్తున్నప్పుడు, అది తన భ్రమ మాత్రమేనని అనుకున్నట్లు మహిళ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇటీవల బెజ్రా రోగులకు సరైన మోతాదులో మందులు ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి ఆసుపత్రి సిబ్బంది రహస్య కెమెరాను అమర్చారు. వీడియోలో, బెజ్రా గర్భిణీ స్త్రీపై అత్యాచారం చేస్తున్నట్లు రికార్డు అయింది. ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.










Next Story