తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య

Doctor committed suicide by shooting himself. హైద‌రాబాద్ నగ‌రంలోని జూబ్లీహిల్స్‌లో ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు

By Medi Samrat
Published on : 27 Feb 2023 4:57 PM IST

తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య

హైద‌రాబాద్ నగ‌రంలోని జూబ్లీహిల్స్‌లో ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి విషమించి అతడు మృతిచెందాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 7లో నివాసం ఉంటున్న డాక్ట‌ర్ మజారుద్దీన్ అనే వ్య‌క్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశాడు. ఇది గమనించిన అక్కడి వారు గాయపడిన మజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మజారుద్దీన్ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మజారుద్దీన్ ఆత్మహత్యకు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మజారుద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కుటుంబ విభేదాల నేపథ్యంలోనే మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వియ్యంకుడని తెలుస్తోంది. పోలీసులు మాట్లాడుతూ.. "డాక్ట‌ర్ మాజారుద్దీన్ అనే వ్య‌క్తి ఈ ఉద‌యం తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశాడు. స్థానికులు అప్ర‌మ‌త్త‌మై ఆయ‌న‌ను జూబ్లీహిల్స్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అన్నారు.


Next Story