పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్ట‌ర్‌

ఓ మ‌హిళా డాక్ట‌ర్ త‌న బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. బిహార్‌లోని స‌ర‌న్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది

By అంజి  Published on  2 July 2024 12:10 PM IST
Doctor, Boyfriend, Genitals, Wedding,Bihar, Crime

పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్ట‌ర్‌

బిహార్‌లోని సరన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు ఓ మహిళా వైద్యురాలు.. తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను నరికివేసింది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ అయిన వ్యక్తి చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)లో చేరాడు. ఆ వ్యక్తితో తనకు గత ఐదేళ్లుగా సంబంధం ఉందని, అయితే అతడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని నిందితురాలు పేర్కొంది. కోర్టులో రిజిస్టర్ మ్యారేజీకి అతడిని ఎలాగోలా ఒప్పించింది. దీంతో ఆమె పెళ్లి కోసం రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లినా బాధితురాడు హాజరు కాలేదు.

దీని తర్వాత, ఆమె ఆ వ్యక్తిని తన ఇంటికి పిలిచింది. అతను అక్కడికి చేరుకోగానే, ఆమె అతనిపై దాడి చేసి, ప్రైవేట్ పార్ట్ కోసేసింది. కౌన్సిలర్ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. "మహిళ హాజీపూర్‌కు చెందిన 25 ఏళ్ల అవివాహిత వైద్యురాలు. ఆమె మధురాలో ప్రాక్టీస్ చేస్తోంది. బాధితుడు కూడా అవివాహితుడు" అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. "మేము నిందితులను అరెస్టు చేసాము. తదుపరి విచారణ జరుగుతోంది" అని ఆయన తెలిపారు.

Next Story