లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..

కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

By Medi Samrat
Published on : 11 Aug 2025 9:19 PM IST

లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..

కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు డాక్టర్ రామచంద్రప్ప, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. కొరటగెరెలోని కోలాల గ్రామంలో రోడ్డు పక్కన ప్లాస్టిక్ సంచుల్లో ఒక మహిళ తల, పాక్షికంగా కుళ్ళిపోయిన, ముక్కలుగా విరిగిన శరీర భాగాలను తుమకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 7న, ఆ మహిళ శరీర భాగాలు నింపిన ఏడు కవర్లను దారిన వెళ్ళేవారు తమ దృష్టికి తీసుకువచ్చారని కొరటగెరె పోలీసు అధికారులు తెలిపారు. కొరటగెరె పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా, ఆగస్టు 8న శరీర భాగాలు, తలతో నిండిన మరో ఏడు ప్లాస్టిక్ సంచులను కనుగొన్నారు. తల సహాయంతో వారు లక్ష్మీదేవి (42) అనే మహిళ గుర్తింపును నిర్ధారించారు.

లక్ష్మీదేవిని దారుణంగా హత్య చేసి 19 ముక్కలుగా నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను కనిపెట్టడానికి, పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కె.వి. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేచారు. తుమకూరు నివాసితులు రామచంద్రప్ప, సతీష్ కె.ఎన్., కిరణ్ కె.ఎస్.లను అరెస్టు చేశారు. విచారణ సమయంలో, నిందితులు తాము లక్ష్మీదేవిని హత్య చేశామని, సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, వివిధ ప్రదేశాలలో పారవేసినట్లు అంగీకరించారు.

Next Story