డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?

గురువారం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో డాక్టర్ హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది

By Medi Samrat  Published on  4 Oct 2024 7:45 PM IST
డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?

గురువారం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో డాక్టర్ హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. యునాని మెడిసిన్ ప్రాక్టీషనర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ జావేద్ అక్తర్ ను నర్సింగ్ హోమ్‌లోనే కాల్చి చంపారు. డాక్టర్‌ను కాల్చిచంపిన మైనర్ నేరం జరిగిన కొద్దిసేపటికే "2024లో హత్యకు పాల్పడ్డా" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ కూడా పెట్టాడు.

అక్టోబర్ 3 తెల్లవారుజామున 16, 17 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు యువకులు ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలోని నిమా ఆసుపత్రిలో తెల్లవారుజామున 1:30 గంటలకు ట్రీట్మెంట్ కావాలని నటిస్తూ హాస్పిటల్ లోకి ప్రవేశించి ఈ హత్య చేశారు. బొటనవేలుకు గాయం అయిందని డ్రెస్సింగ్ మార్చమని ఆసుపత్రి సిబ్బందిని ఒక అబ్బాయి కోరాడు. కొన్ని క్షణాల తర్వాత డాక్టర్ అక్తర్‌ను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చేశారు.

వైద్యుడు ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు వసూలు చేశాడని అందుకే చంపేసినట్లు అరెస్టయిన మైనర్ పోలీసులకు తెలిపాడు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, కాల్పుల్లో పాల్గొన్న 16 ఏళ్ల మరో బాలుడి కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.

Next Story