ఢిల్లీలోని 15 ఏళ్ల బాలిక తన ట్యూషన్ టీచర్ తనపై అనేకసార్లు అత్యాచారం చేసి మానసికంగా వేధించాడని ఆరోపించింది. ఈ ఘటనపై బుధవారం నాడు బాలిక తన తండ్రితో కలిసి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
దక్షిణ ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఫిర్యాదులో 2022 నుండి గత మూడేళ్లుగా ట్యూషన్ సెంటర్‌లో తరగతులకు హాజరవుతున్నట్లు తెలిపింది. ట్యూటర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, బెదిరించి, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె ఆరోపించింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.