ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తున్నాడు..!

Delhi Police arrests man posing as IPS officer for duping women. ఢిల్లీలో ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తూ వచ్చాడు.

By Medi Samrat  Published on  19 Dec 2022 2:50 PM GMT
ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తున్నాడు..!

ఢిల్లీలో ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. పెద్ద మొత్తంలో డబ్బు గుంజాడు కూడానూ..! అయితే ఎలాంటి కాలేజీ సర్టిఫికేట్ లేకుండా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ కు చెందిన వికాస్ గౌతమ్ చాలా మందిని ఢిల్లీ ప్రాంతంలో మోసం చేశాడు. ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్‌గా పోజులిచ్చి కేవలం మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. తనను తాను ఐపీఎస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఢిల్లీలోని ఓ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు ఔటర్ ఢిల్లీలోని సైబర్ సెల్ అధికారులు వికాస్‌ను అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారిగా నటిస్తూ వికాస్ రూ.25వేలు తీసుకున్నాడని ఆమె ఆరోపించింది.

ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఐపీఎస్ అధికారినని నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. తన నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా, అతను పలువురు నాయకులతో పోజులిచ్చిన అనేక చిత్రాలను అప్‌లోడ్ చేశాడు. అతను రెడ్ బీకాన్ లైట్ ఉన్న కారుతో పోజులిచ్చాడు. విచారణలో.. వికాస్ 8వ తరగతి పాస్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ముఖర్జీ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో పని చేయడం ప్రారంభించాడని, అక్కడ చాలా మంది సివిల్ సర్వీస్ అభ్యర్థులు వస్తారని పోలీసులకు తెలిసింది. 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ప్రజలను మోసం చేసేందుకు పథకం వేశాడు. అతడు పలువురు మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతోంది.


Next Story