పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

Delhi Man Kills Paralysed Father After He Peed On Bed. ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో పక్షవాతంతో బాధపడుతున్న తన తండ్రిని

By Medi Samrat  Published on  6 Feb 2023 8:45 PM IST
పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో పక్షవాతంతో బాధపడుతున్న తన తండ్రిని ఓ 20 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని సుమిత్ శర్మగా గుర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జితేంద్ర శర్మ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు సంఘటనా స్థలానికి చేరుకోగా, శర్మ తన మంచంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతడిని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించి శనివారం శవపరీక్ష నిర్వహించినట్లు అధికారి తెలిపారు. శవపరీక్షలో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.

జితేంద్ర శర్మ చనిపోయిన కారణం విచారణలో తెలిసింది. పొరుగువారి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు. మద్యం మత్తులో ఈ దారుణానికి తెగబడ్డాడని తెలుస్తోంది. విచారణలో సుమిత్ శర్మ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన తండ్రి పక్షవాతంతో ఉన్నాడని, అతనిని తానే చూసుకుంటున్నానని నిందితుడు చెప్పాడు.




Next Story