మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఏం చేశాడంటే..?

మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించాడు.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 9:20 PM IST

మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఏం చేశాడంటే..?

మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించాడు. ఆమె ఏడేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు పిల్లాడిని రక్షించారు. ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు సహచరులను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.

హర్యానాలోని హన్సిలో నిందితుడు 24 ఏళ్ల అజయ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన కొడుకుతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ రిపేరీ పని చేసుకునే వర్మ, తన సహచరులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేయడానికి కుట్ర పన్నాడు. తనతో తిరిగి రావాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ పనికి తెగించాడు. టెంట్ హౌస్‌లో పనిచేసే అమిత్ (18), పివిసి ఫ్యాక్టరీలో పనిచేసే సచిన్ (20), స్వీపర్ అజయ్ (20) లు అతడికి ఈ కిడ్నాప్ లో సహాయం చేశారు. అమిత్ , సచిన్ హర్యానాలోని హిసార్ నివాసితులు కాగా, అజయ్ ఢిల్లీలోని వికాస్‌పురికి చెందినవాడు.

భర్తతో విడాకులు తీసుకుని ఏడేళ్ల కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న మహిళ ఇటీవల అజయ్‌ వర్మ అనే 24 ఏళ్ల యువకుడితో సహజీనం చేసింది. అతడు నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో విడిచిపెట్టి పుట్టింటికే వెళ్లింది. ఈ క్రమంలో మహిళను తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్న అజయ్‌ వర్మ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె కొడుకును కిడ్నాప్‌ చేశాడు. స్కూల్‌కు వెళ్లిన కొడుకు తిరిగి ఇంటికిరాకపోవడంతో బాధితురాలు వికాస్‌పురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్‌ వర్మపై తనకు అనుమానం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నది. దాంతో అజయ్‌ వర్మ ఫోన్‌ ట్రాక్‌ చేసిన పోలీసులు ఓ తోటలో బాలుడితో కలిసి ఉన్న నిందితులను పట్టుకుని బాలుడిని క్షేమంగా విడిపించారు.

Next Story