ఆ ఫేక్ ట్రావెల్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేశారంటే..!

Delhi man arrested for duping people through fake travel website. ట్రావెలింగ్.. ఇప్పటి యువత, వయసులో ఉన్న వ్యక్తులు వీలు దొరికితే చాలు

By Medi Samrat  Published on  31 July 2022 4:36 PM IST
ఆ ఫేక్ ట్రావెల్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేశారంటే..!

ట్రావెలింగ్.. ఇప్పటి యువత, వయసులో ఉన్న వ్యక్తులు వీలు దొరికితే చాలు ఎంచెక్కా టూర్స్ కు వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడైతే ఇంతకు ముందు అక్కడికి వెళ్లిన వారిని అడిగి ఎంత ఖర్చు అవుతుంది.. ఏయే ప్రాంతాలు బాగుంటాయి. ఎక్కడ విడిది బాగుంటుంది అని అడుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ కారణంగా చాలా మార్పులు వచ్చేశాయి. ట్రావెల్ బ్లాగ్ లు, వెబ్ సైట్లు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాయి. ఇక అంతకు ముందు వెళ్లి వచ్చిన వ్యక్తులు ఇచ్చిన రేటింగ్స్ ద్వారా మనకు ఏవి సెట్ అవుతాయో తెలుసుకోవచ్చు. అయితే జెన్యూన్ వెబ్సైట్స్ ను కాకుండా ఏది పడితే అది నమ్మకూడదు. అందుకు ఉదాహరణ ఈ ఘటన..!

33 ఏళ్ల వ్యక్తి.. నకిలీ ట్రావెల్ వెబ్‌సైట్‌ను సృష్టించి.. విమాన బుకింగ్‌లకు సంబంధించి.. దాదాపు 90 మందిని మోసం చేసినందుకు అరెస్టు చేశారు. నిందితుడిని ఢిల్లీ లోని ద్వారక ప్రాంతానికి చెందిన అవిరల్ రావల్‌గా గుర్తించారు. ఐఎఫ్‌ఎస్‌ఓ, స్పెషల్ సెల్‌లో యోగేందర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. www.travolook.in అనే యూఆర్‌ఎల్‌తో ఒక మోసపూరిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారని.. విమానాలను బుక్ చేసుకున్నారనే సాకుతో ప్రజలను మోసం చేస్తోందని సింగ్ ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. బాధితుల బ్యాంకు ఖాతాల విశ్లేషణ ద్వారా వింగ్ ఇన్ ట్రావెల్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు వెల్లడైంది. దీనికి తోడు నిందితులు గూగుల్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తేలింది. అలా దాదాపు 90 మంది అతడి వెబ్సైట్ మాయలో పడి.. డబ్బులు పోగొట్టుకున్నారు. ఇలా ఎప్పుడైనా టూర్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు ప్రముఖ ట్రావెలింగ్ వెబ్సైట్స్ ను వాడుకోవడం బెటర్.. ఇలాంటి మోసపూరిత వెబ్సైట్స్ కు దూరంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తూ ఉన్నారు.










Next Story