ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువ‌తిపై అత్యాచారం

Delhi Girl Misdeed in Gurugram Pretext of getting a job and record obscene video. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి గురుగ్రామ్ తీసుకొచ్చి ఓ యువ‌తిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

By Medi Samrat  Published on  23 May 2023 1:21 PM GMT
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువ‌తిపై అత్యాచారం

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి గురుగ్రామ్ తీసుకొచ్చి ఓ యువ‌తిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్య‌క్తి. నిందితుడు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడు. వీడియోలు కూడా తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డీఎల్‌ఎఫ్‌ ఫేస్‌ 1 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల యువతి.. ఐదు నెలల క్రితం అమిత్ అనే వ్యక్తితో ఫోన్ ద్వారా స్నేహం చేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం ఉంద‌ని అమిత్ చెప్పాడు. బాధితురాలు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ విషయాన్ని అమిత్‌తో చెప్పగా.. ఉద్యోగం ఇప్పిస్తానని అమిత్ చెప్పాడు. మే 21న అమిత్ తన కార్యాలయాన్ని చూపించి.. ఉద్యోగం గురించి మాట్లాడేందుకు గురుగ్రామ్‌కు రావాలని బాధితురాలికి చెప్పాడు. అందుకు ఆమె అక్క‌డికి వెళ్ల‌గా.. ధౌలాకువాన్ నుంచి ఆమెను కారులో గురుగ్రామ్ కు తీసుకొచ్చాడు అమిత్‌. అక్కడ ఆంబియెన్స్ మాల్ దగ్గర తన ఆఫీసును చూపించాడు. అనంత‌రం బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ల‌గానే.. ఆమెను కారులో కూర్చోబెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ స‌మ‌యంలో నిందితుడు అశ్లీల వీడియో కూడా తీశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాన‌న‌డంతో.. నిందితుడు వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story