స్కూల్‌కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు.. క‌న్న‌ తండ్రే దారుణానికి ఒడిగ‌ట్టాడు..!

పదేళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్య చేసి భార్యకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By Medi Samrat
Published on : 30 July 2025 9:36 PM IST

స్కూల్‌కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు.. క‌న్న‌ తండ్రే దారుణానికి ఒడిగ‌ట్టాడు..!

పదేళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్య చేసి భార్యకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నరేలా ప్రాంతంలో నివసిస్తున్న నరేంద్రతో విభేదాల వల్ల భార్య కోమల్‌ విడిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె వేరుగా నివసిస్తూ ఉంది. మంగళవారం స్కూల్‌కు వెళ్లిన చిన్న కుమారుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో కోమల్‌ ఆందోళన చెందింది. ఇంతలో ఊహించని విధంగా భర్త నరేంద్ర నుండి ఆమెకు ఫోన్‌ వచ్చింది. చిన్న కుమారుడిని హత్య చేసినట్లు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కోమల్‌ ఫిర్యాదుతో పోలీసులు నరేంద్ర ఇంటికి చేరుకున్నారు. మెడపై గాయాలతో మరణించిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి కోమల్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story