ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు కామెంట్లపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యలకు దారితీసింది. సోషల్‌మీడియాలో అమ్మాయితో వివాదం కారణంగా ఢిల్లీలోని ఔటర్‌లోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపేశారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని ముకుంద్‌పూర్ పార్ట్ 2లో తనను కలవాలని బాధితులను ఆ మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే వారిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన బాధితులు రక్తపు మడుగులో పడి ఉండడం స్థానికుల దృష్టికి వచ్చింది. బాధితులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ముకుంద్‌పూర్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి సాహిల్, నిఖిల్ అనే ఇద్దరు యువకులను చనిపోయిన వారిగా గుర్తించారు. ఈ కేసులో బాలిక, ఆమె మైనర్ సోదరుడు సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యపై ఓ అమ్మాయికి, నిఖిల్‌కు మధ్య గొడవ జరిగింది. వీధిలోకి వచ్చి మీ ధైర్యం చూపించండి అంటూ సవాల్ విసిరింది ఆ అమ్మాయి. దీంతో వివాదం మరింత పెరిగి రాత్రి సమయంలో సాహిల్‌తో కలిసి నిఖిల్ అక్కడికి చేరుకున్నాడు. బాలిక తనతో పాటూ పిలుచుకొని వచ్చిన వ్యక్తులతో సాహిల్, నిఖిల్ లపై దాడి చేయించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 26 ఏళ్ల నిఖిల్, 19 ఏళ్ల సాహిల్‌గా గుర్తించారు.