పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..

ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By Medi Samrat  Published on  2 Jan 2025 8:15 PM IST
పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..

ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పునీత్ ఖురానాకు, అతని భార్య మనీకా పహ్వాకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీ కెమెరాల్లో వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అయింది. ఇప్పటికే 15 నిమిషాల కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

తన మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో 40 ఏళ్ల పునీత్ ఖురానా తన భార్య మాణికా పహ్వా, అత్తమామల నుండి అనుభవించిన మానసిక హింస గురించి చెప్పారు. పరస్పర అంగీకారంతో ప్రారంభమైన విడాకుల ప్రక్రియ తన భార్య, అత్తమామల కారణంగా తీవ్ర వివాదానికి ఎలా దారితీసిందో ఖురానా వీడియోలో వివరించారు. ఆర్థికంగా భారమైన డిమాండ్లు విధించారని, అదనంగా రూ. 10 లక్షలు చెల్లించాలని కోరగా తాను భరించలేకపోయానని అన్నారు. అత్తమామలు, నా భార్య నన్ను తీవ్రంగా హింసిస్తూ వచ్చారు.. దీంతో ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పారు.

Next Story