ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్ బ్లాక్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. గ్రామంలో 10 ఏళ్ల బాలుడి మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉండటంతో గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇంటి నుండి 500 మీటర్ల దూరంలో నది ఒడ్డున 10 ముక్కలుగా నరికేసిన బాలుడి మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
ఐదు రోజుల క్రితం తోర్ఫా గ్రామానికి చెందిన బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఈ సంఘటన గురించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. కానీ వారు కూడా బాలుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఐదు రోజుల తరువాత ఈ ఉదయం బాలుడి మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉంది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. అనంతరం బలంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై గ్రామస్థుల్లో నరబలి జరిగి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. మతపరమైన మూఢనమ్మకాలతో ఇలాంటి పని చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. గ్రామస్థుల వాంగ్మూలాలు నమోదు చేయడంతోపాటు చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టారు.