తండ్రి చేసిన దారుణం చూసిన కూతురు.. స్నేహితుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు.. ఆ తర్వాత..

Daughter took father to jail in Madhyapradesh. మద్యం మత్తులో తండ్రి చేసిన దారుణాన్ని చూసిన కూతురు తన స్నేహితుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో

By అంజి  Published on  27 Oct 2021 5:18 PM IST
తండ్రి చేసిన దారుణం చూసిన కూతురు.. స్నేహితుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు.. ఆ తర్వాత..

మద్యం మత్తులో తండ్రి చేసిన దారుణాన్ని చూసిన కూతురు తన స్నేహితుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో కూతురు చేసిన పనికి తండ్రికి కోలుకోలేని దెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా సింగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘట్‌పిపారియా గ్రామంలో కన్హయ్య బార్సియ్య అనే తండ్రి తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్ల కిందట తల్లి చనిపోవడంతో తండ్రి, కూతురు ఇద్దరే ఉంటున్నారు. కన్హయ్యకు మద్యం సేవించే అలవాటు బాగా ఉండేది. భార్య చనిపోయినప్పటి నుంచి కూతురిని తండ్రి కొట్టేవాడు. సోమవారం రోజున సాయంత్రం కన్హయ్య తన ఫ్రెండ్‌ అజేష్‌ వర్మతో కలిసి మద్యం సేవించేందుకు గ్రామ శివారుకు వెళ్లారు.

మద్యం సేవించే సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఘర్షణకు దిగారు. అజేష్‌ వర్మను కన్హయ్య చంపేశాడు. ఈ దారుణాన్ని కన్హయ్య కూతురు చూసింది. దీంతో జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని తండ్రి కన్హయ్య బెదిరించాడు. మంగళవారం నాడు కూతురు తన స్నేహితుడితో కలిసి పీఎస్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఆ అమ్మాయ కొంత మంది పోలీసులు గ్రామానికి వచ్చారు. దీంతో కన్హయ్య ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అతడు అనుకున్నదే నిజమైంది. తండ్రి చేసిన దారుణాన్ని కూతురు పోలీసులకు చెప్పడంతో.. కన్హయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమ్మాయి చెప్పిన ఆధారాలతో సంఘటా స్థలానికి వెళ్లామని పోలీసులు తెలిపారు. చివరికి కన్హయ్య తను చేసిన తప్పును ఒప్పుకున్నాడని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.

Next Story