బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి తల్లిని కిరాతకంగా హత్య చేసిన కుతురు.. దోపిడి కట్టుకథ అల్లి..

Daughter becomes murderer of her own mother for a little money. దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 19న ఓ మహిళను

By Medi Samrat  Published on  21 Feb 2022 7:59 AM GMT
బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి తల్లిని కిరాతకంగా హత్య చేసిన కుతురు.. దోపిడి కట్టుకథ అల్లి..

దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 19న ఓ మహిళను దుండగులు హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, ఇంటి మొదటి అంతస్తులో రక్తంతో తడిసిన మంచంపై 55 ఏళ్ల సుధా రాణి మృతదేహం పడి ఉంది. సుధా రాణి గొంతుకోసి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారని కుమార్తె దేవయాని వాంగ్మూలం ఇచ్చింది. దుండగుల చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఇద్దరి ముఖాలు కప్పబడి ఉన్నాయని తెలిపింది. అమ్మ నగలనే కాకుండా, ఇంట్లో ఉంచిన నగదును కూడా ఎత్తుకెళ్లారని తెలిపింది.

అయితే.. కూతురు వాంగ్మూలంకు, క్రైమ్ సీన్ కు మధ్య చాలా తేడా ఉంది. పోలీసులు దేవయానిని సుదీర్ఘంగా విచారించగా తాను, తన బాయ్ ఫ్రెండ్ కార్తీక్ చౌహాన్ కలిసి తన తల్లిని హత్య చేసి, దోపిడి కట్టు కథ అల్లామని పోలీసుల ముందు ఒప్పుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తల్లిని హత్య చేయడానికి సహకరించినట్లు ఆమె అంగీకరించింది.

నిందితురాలు దేవయాని గ్రేటర్ నోయిడాకు చెందిన చేతన్‌ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త వద్దకు వెళ్లకపోతే ఆస్తి ఇవ్వనని, ఇంటి నుంచి గెంటేస్తానని తన తల్లి బెదిరించిందని దేవయాని తెలిపింది. మా అమ్మ తనకి డబ్బు ఇవ్వడం మానేసింది. దీంతో ప్లాన్ వేసి తల్లిని చంపేశానని తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందు దేవయాని తన తల్లి, మామ సంజయ్‌కు టీలో నిద్రమాత్రలు వేసింది. వారు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత దేవయాని కార్తీక్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత దేవయాని, కార్తీక్‌తో కలిసి సర్జికల్ బ్లేడ్‌తో తల్లి గొంతు కోసి హత్య చేసింది. దేవయాని కార్తీక్‌కు నగలు, నగదు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసింది.


Next Story
Share it