చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం.. పోలీసుల ఎంట్రీతో..

Dance of bar girls on birthday, corona protocol flouted. చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని

By Medi Samrat  Published on  1 Jan 2022 9:17 AM GMT
చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం.. పోలీసుల ఎంట్రీతో..

చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ నిర్వహించారు. వీడియో వైరల్ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతో అధికారులు జిల్లాలో 144 సెక్షన్ విధించింది. కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు సూచనలు ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా పుట్టినరోజు వేడుకల్లో బార్ గర్ల్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వైరల్ వీడియో డిసెంబర్ 29 న చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ కేసు ఫతేపూర్ జిల్లాలోని మల్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంధీ గ్రామంలో చోటు చేసుకుంది.

డిసెంబర్ 25న ఇక్కడ నివాసం ఉంటున్న సూరజ్ బాలి రైదాస్ మనవరాలు పుట్టినరోజు. అధికారుల అనుమతి తీసుకోకుండానే బర్త్‌డే పార్టీలో బార్ గర్ల్స్ తో డ్యాన్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలోని ప్రేక్షకులు నృత్యాన్ని చూడటానికి గుమిగూడారు. కరోనా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు. ఈ ఘటనను అక్కడికక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయంపై డీఎస్పీ దినేష్ మిశ్రా మాట్లాడుతూ.. మల్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంధి గ్రామంలో సూరజ్‌బలి రైదాస్ మనవరాలు పుట్టినరోజున డిసెంబర్ 29న అనుమతి లేకుండా బార్ గర్ల్స్ డ్యాన్స్ చేశారని చెప్పారు. ఈ విషయమై కేసు నమోదైందని చెప్పారు. అధికారులు ప్రస్తుతం విచారణ చేపట్టారు.


Next Story
Share it