టాయిలెట్ సీటును దొంగిలించాడనే అనుమానంతో దళిత వ్యక్తిపై దాడి

Dalit man thrashed, head shaved for 'stealing' toilet seat in Uttar Pradesh. ఒక ఇంటి నుండి టాయిలెట్ సీటును దొంగిలించాడనే అనుమానంతో 30 ఏళ్ల దళిత వ్యక్తిని కొట్

By Medi Samrat  Published on  23 Oct 2022 2:15 PM GMT
టాయిలెట్ సీటును దొంగిలించాడనే అనుమానంతో దళిత వ్యక్తిపై దాడి

ఒక ఇంటి నుండి టాయిలెట్ సీటును దొంగిలించాడనే అనుమానంతో 30 ఏళ్ల దళిత వ్యక్తిని కొట్టి, అతని ముఖానికి నల్ల రంగు పూసి, తల గుండు చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని బర్కతాన్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు రాజేష్ కుమార్ బహ్రైచ్ జిల్లాలోని బర్కతాన్ గ్రామ నివాసి. వృత్తి రీత్యా రోజువారీ కూలీ. అత‌నిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు గత రెండు-మూడు రోజులుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విష‌య‌మై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు, స్థానిక బిజెపి నాయకుడు రాధేశ్యామ్ మిశ్రా పరారీలో ఉన్నాడు. మిశ్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బహ్రైచ్ ఏఎస్పీ (రూరల్) అశోక్ కుమార్ మాట్లాడుతూ.. "మూడవ నిందితుడి కోసం అన్వేషణ జరుగుతుంది. ఇప్ప‌టికి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. కొన్ని వస్తువులను దొంగిలించి, అతన్ని కొట్టినట్లు వారు అనుమానించారు. దొంగతనం జరిగినట్లు అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. విచారణ కొనసాగుతోందని అన్నారు. వైరల్ వీడియోలో కొంద‌మంది వ్యక్తుల గుంపు విద్యుత్ స్తంభానికి కట్టివేసి రాజేష్ కుమార్‌పై దాడి చేయడం.. అతని ముఖాన్ని నల్లగా చేయడం.. రహదారి మధ్యలో తల షేవింగ్ చేయడం చూడవచ్చు.

బాధిత‌ వ్యక్తి మాట్లాడుతూ.. "అక్టోబర్ 18 మధ్యాహ్నం 2 గంటల సమయంలో పొరుగు గ్రామానికి చెందిన కొంతమంది నన్ను కొట్టారు. కులం పేరుతో దూషించారు. నా తల గుండు కొట్టి, నా ముఖం మీద నల్ల సిరా వేశారు. గ్రామ కూడలి వద్ద నేను దొంగతనం చేశానని అనుమానించి ఇలా చేశారు. నన్ను చంపేస్తామని కూడా బెదిరించారని తెలిపాడు.


Next Story