భార్య మీద కోపం చూపించడానికి వీడియో కాల్ చేసిన భర్త.. ఆ తర్వాత..!
Cynical husband made a video call to torture his wife and then. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లో ఓ భర్త తన భార్యకు వీడియో కాల్ చేసి తన సొంత కారుకు
By Medi Samrat Published on 22 Feb 2022 8:37 AM GMT
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లో ఓ భర్త తన భార్యకు వీడియో కాల్ చేసి తన సొంత కారుకు నిప్పు పెట్టాడు. అతడు చేసిన పని కారణంగా పక్కనే ఆపి ఉంచిన మరో కారు మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలో పార్క్ చేసిన కార్లన్నింటినీ తొలగించారు. మంటల్లో చిక్కుకున్న రెండవ కారును పక్కకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారులు ఆ భర్తను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో భార్య తన తండ్రితో సంఘటనా స్థలానికి చేరుకుంది. భర్తతో తాను విసిగిపోయానని, కానీ ఏమీ చేయలేనని చెప్పింది. భరత్‌పూర్‌లోని సూరజ్‌మల్ నగర్ ప్రాంతానికి చెందిన కాంత ప్రసాద్ తన కుమార్తె ప్రీతిని నదియాకు ప్రవీణ్‌తో 2003లో వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే ప్రవీణ్ ప్రీతితో గొడవ పడ్డాడు. అప్పటి నుండి గొడవలు సర్వ సాధారణం అయ్యాయి. ప్రవీణ్- ప్రీతికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రవీణ్ కొన్నిసార్లు భార్యకు హాని తలపెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేశాడని ప్రీతీ తండ్రి చెప్పాడు. కొన్నిసార్లు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా ప్రీతిని హింసిస్తూనే ఉండేవాడట. ఒక్కరోజు ముందు తన తండ్రి ఇంటికి వెళ్ళింది ప్రీతి. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్ సాయంత్రం తాగి ఇంటికి వచ్చి వీడియో కాల్ చేసి మరీ కారును కాల్చేశాడు.