బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా పేలిన‌ సిలిండర్.. 100 మీట‌ర్ల దూరంలో..

Cylinder burst while filling air in balloon. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు ఆనుకుని ఉన్న ముస్సోరీలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  26 March 2022 10:46 AM GMT
బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా పేలిన‌ సిలిండర్.. 100 మీట‌ర్ల దూరంలో..

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు ఆనుకుని ఉన్న ముస్సోరీలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రత కారణంగా ఆ వ్యక్తి కాలు శరీరం నుండి విడిపోయి వంద మీటర్ల దూరంలో పడిపోయింది. ఈ పేలుడు కారణంగా పలు హోటళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.

సమాచారం ప్రకారం, 19 ఏళ్ల అరవింద్ కుమార్ అనే యువకుడు బెలూన్లు అమ్ముతున్నాడు. కుల్దీస్ సమ్మర్ హౌస్ సమీపంలోని హోటల్ పైకప్పుపై బెలూన్‌లో గ్యాస్ నింపుతున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడులో, యువకులలో ఒకరు కాలు కోల్పోయారు. కాలు సంఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలో పడిపోయింది. ఈ పేలుడు శబ్ధానికి చుట్టుపక్కల వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కొందరు వ్యక్తులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు యువకుడిని పెద్ద ఆసుపత్రికి తరలించారు.

అరవింద్ కుమార్ యూపీలోని అమ్రోహాలోని రసూల్‌పూర్ గామ్డి గ్రామ నివాసి.. ముస్సోరీలోని మాల్ రోడ్‌లో ఉన్న ఓ హోటల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడని ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ గిరీష్ చంద్ శర్మ తెలిపారు. దీంతో పాటు సాయంత్రం పూట గ్యాస్ బెలూన్లు కూడా విక్రయిస్తుంటాడు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం కూడా హోటల్ పైన బెలూన్లు నింపుతుండగా.. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story
Share it