ఐదు రోజుల కిందట కనిపించకుండా పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ భార్య.. చివరికి

CRPF jawan's wife found murdered in Kanpur. ఐదు రోజుల కిందట తప్పిపోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ భార్య చివరికి ప్రాణాలు కోల్పోయింది.

By Medi Samrat  Published on  27 Feb 2022 4:53 PM IST
ఐదు రోజుల కిందట కనిపించకుండా పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ భార్య.. చివరికి

ఐదు రోజుల కిందట తప్పిపోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ భార్య చివరికి ప్రాణాలు కోల్పోయింది. కాన్పూర్ లోని భౌపూర్ మైథా దగ్గర డ్రైనేజీ సమీపంలో హత్యకు గురైనట్లు కాన్పూర్ పోలీసులు శనివారం తెలిపారు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో బాధితురాలి ప్రేమికుడు, మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. "హత్యకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసాము. ముఖ్తార్ ప్రధాన నిందితుడిగానూ, చనిపోయిన మహిళ ప్రేమికుడిగా గుర్తించబడింది. తదుపరి విచారణ జరుగుతోంది" అని పశ్చిమ కాన్పూర్ అదనపు డిసిపి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

కాన్పూర్‌లోని పంకి రతన్‌పూర్ కాలనీ నివాసి CRPF జవాన్ ఇంద్రపాల్‌ మెయిన్‌పురిలో ఎన్నికల విధుల్లో ఉండగా, అతని భార్య గీత (34), వారి ఇద్దరు పిల్లలు సుశాంత్, సిద్ధార్థ్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 20న ఇంద్రపాల్ తన భార్యకు పలుమార్లు కాల్ చేసినా ఆమె స్పందించలేదు. ఏమైనా జరిగిందేమోనని గ్రహించిన ఇంద్రపాల్ వెంటనే పంకి పోలీసులకు సమాచారం అందించాడు, వారు ప్రదేశానికి చేరుకుని ఆమె ఇంట్లో లేరని తెలుసుకున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గదిలో ఖాళీ బీరు డబ్బాలు, గ్లాసులు, కొన్ని అభ్యంతరకర వస్తువులు లభించాయి. ఫిబ్రవరి 21న, ఇంద్రపాల్ ఇంటికి తిరిగి వచ్చి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి కాల్ రికార్డుల ప్రకారం ఆమె కనిపించకుండా పోయే ముందు రూరా జమాల్‌పూర్ ప్రాంతానికి చెందిన కారు మెకానిక్ ముఖ్తార్‌కు చివరి కాల్ చేసినట్లు చూపించాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ముఖ్తార్‌ నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం రాత్రి పంకి స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ అంజన్‌కుమార్‌ డ్రెయిన్‌ సమీపంలో మృతదేహాన్ని వెలికితీశారు. గీత వేరొకరితో మాట్లాడటం ప్రారంభించడంతో ఆమెపై కోపం తెచ్చుకున్నట్లు ముఖ్తార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం, ఆమెను తనతో పాటు కారులో తీసుకెళ్లిన తర్వాత, ముఖ్తార్ ఆమెను గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందర్‌పాల్‌తో వివాహానికి ముందే బాధితురాలితో తనకు సంబంధం ఉందని పోలీసులకు తెలిపాడు.


Next Story