నా భర్త ఓ డాక్టర్.. అశ్లీల వీడియోలను వెబ్ సైట్లకు అమ్ముకున్నాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ వైద్యుడు అశ్లీల వీడియోలను చిత్రీకరించి, అమ్ముతున్నాడని షాకింగ్ ఆరోపణలు వచ్చాయి.

By Medi Samrat
Published on : 24 May 2025 9:15 PM IST

నా భర్త ఓ డాక్టర్.. అశ్లీల వీడియోలను వెబ్ సైట్లకు అమ్ముకున్నాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ వైద్యుడు అశ్లీల వీడియోలను చిత్రీకరించి, అమ్ముతున్నాడని షాకింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో అశ్లీల వీడియోలు చిత్రీకరించాడాని, ఆ వీడియోలను పోర్న్ సైట్స్ కు అమ్ముకున్నాడని భార్య సింపీ పాండే ఆరోపించారు. ఆ వాదనలను డాక్టర్ తోసిపుచ్చారు. తన భార్య తన ఆస్తిని దోచుకునేందుకు డీప్‌ఫేక్ వీడియోలతో తన పరువు తీయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. వైరల్ చిత్రాలు డాక్టర్ స్త్రీల దుస్తులు ధరించి నటిస్తున్నట్లు చూపించాయి.

సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పర్యవేక్షించిన డాక్టర్ దూబే, సింపీ పాండేను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య తన భర్త తనను గోరఖ్‌పూర్ ఇంట్లో వదిలి ప్రభుత్వ వసతి గృహంలో అశ్లీల కార్యకలాపాలు నిర్వహించాడని ఆరోపించింది. ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా అతను డబ్బు సంపాదించేవాడని ఆమె ఆరోపించింది. పెయిడ్ వెబ్‌సైట్‌లో కొన్ని వీడియోలు దొరికాయని కూడా ఆమె ఆరోపించింది. తాను ఈ విషయమై భర్తతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, అతను తనను, తన సోదరుడిని కొట్టాడని ఆమె వివరించింది. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశారు.

Next Story