రూ.100 కోసం వ్యక్తి హత్య... నివ్వెరపోయిన పోలీసులు..!

Crime news: A Man Killed His Friend for Rs. 100. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 100 రూపాయల కోసం స్నేహితుడి ప్రాణం తీశాడు ఓ వ్యక్తి.

By అంజి  Published on  14 Oct 2021 9:03 AM GMT
రూ.100 కోసం వ్యక్తి హత్య... నివ్వెరపోయిన పోలీసులు..!

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 100 రూపాయల కోసం స్నేహితుడి ప్రాణం తీశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే... కూలీ పని నిమిత్తం మధ్యప్రదేశ్‌ నుండి రెండు నెలల క్రితం 20 మంది కూలీలు రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజారకు వచ్చారు. అందులో ఇద్దరు కూలీలు దయాళ్, సేతారామ్‌లు ఓ రైతు దగ్గర పనికి వెళ్లారు. కూలీ చేసినందుకు వారికి రైతులు డబ్బులు ఇచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం సేవించిన ఆ ఇద్దరూ మద్యం మత్తులో చాలా సేపు వాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆవేశానికి గురైన సేతారాం తన దగ్గర ఉన్న చాకుతో దయాల్‌ ఛాతీపై బలంగా పొడిచాడు. దీంతో దయాళ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ నెల 11న రాత్రి జరిగిన ఈ ఘటనపై మొదట హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. రూ.100 విషయంలో జరిగిన వాగ్వాదంలోనే దయాళ్‌పై చాకుతో దాడి చేసినట్లు సేత్రాం పోలీసుల వద్ద అంగీకరించాడు. మృతుడు, హంతకుడు ఇద్దరు వివాహితులే. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దయాళ్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. క్షణికావేశంతో చేసిన తప్పుతో సేత్‌రాం కటకటాలపాలయ్యాడు. రూ.100 కోసం జరిగిన గొడవ ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర వేదనను నింపింది.

Next Story
Share it