ఆ కోరిక తీర్చేందుకు నిరాకరించిందని యువతిని హత్య చేసిన కజిన్

Cousin killed girl after rape bid failed. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ బాంక్వెట్‌ హాల్‌లో వివాహం జరుగుతుండగా ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కాగా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By అంజి  Published on  18 Nov 2021 2:28 PM GMT
ఆ కోరిక తీర్చేందుకు నిరాకరించిందని యువతిని హత్య చేసిన కజిన్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ బాంక్వెట్‌ హాల్‌లో వివాహం జరుగుతుండగా ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కాగా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలికి వరుసకు సోదరుడు అయ్యే 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యువతి (19)పై అత్యాచారం చేయడానికి నిందితుడు ప్రయత్నించాడు. యువతి ప్రతిఘటించడంతో గొంతు కోసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. యువతి హత్య జరిగిన తర్వాత ఆమె కజిన్‌ కనిపించట్లేదని కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు.

సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (మీరట్) ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ... విచారణలో 19 ఏళ్ల యువతి కుటుంబం, బంధువులు.. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి దాదాపు రెండు గంటల పాటు కనిపించకుండా పోయారని చెప్పారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశాల్‌ గుప్తాని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో 'అత్యాచారం విఫలమైన తర్వాత ఆమెను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు'.

Next Story
Share it