నాలుగు నెలల కిందట పెళ్లి.. హొలీ రంగులను కడుక్కోడానికి బాత్ రూమ్ లోకి వెళ్లారు

Couple went to washroom to get rid of Holi's colour. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఘరౌండాలో దంపతులు

By Medi Samrat  Published on  19 March 2022 3:45 PM GMT
నాలుగు నెలల కిందట పెళ్లి.. హొలీ రంగులను కడుక్కోడానికి బాత్ రూమ్ లోకి వెళ్లారు

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఘరౌండాలో దంపతులు బాత్‌రూమ్‌లో ఊపిరాడక మృతి చెందారు. మృతులైన గౌరవ్, శిల్పిలకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం హోలీ పండుగను జరుపుకున్నాక రంగులను కడుక్కోడానికి ఇద్దరూ బాత్‌రూమ్‌కు వెళ్లగా.. గ్యాస్ లీక్ కావడంతో ప్రాణాలు కోల్పోయారు. వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వీరిద్దరికీ శనివారం కర్నాల్‌లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ఆ కుటుంబానికి చెందిన యోగేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. నా కజిన్‌ బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని తనకు ఫోన్‌ వచ్చిందని చెప్పారు. ఫోన్ కాల్ అనంతరం ఇంటికి వచ్చి గ్రామంలోని వైద్యులతో పరీక్షలు చేయించాడు. వెంటనే అతడిని పానిపట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అడ్మిట్‌ చేసేందుకు నిరాకరించారు. అనంతరం వారిని ఘరౌండాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాత్‌రూమ్‌లో గ్యాస్‌ గీజర్‌ ఉంది. ఇద్దరూ హోలీ పండుగను జరుపుకుని మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో చేతులు, నోరు కడుక్కుంటున్నారు. గ్యాస్‌తో కూడిన గీజర్‌ నుండి లీకేజీ ఉండడంతో ఇద్దరూ ఊపిరాడక చనిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తల్లి వారిని పిలిచేందుకు వెళ్లింది. వారిద్దరూ బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఎస్‌హెచ్‌ఓ దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్, శిల్పి మృతి చెందినట్లు ఆస్పత్రి నుంచి నివేదిక అందింది. బాత్‌రూమ్‌లో గ్యాస్‌ గీజర్‌ ఉందని, గ్యాస్‌ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.












Next Story