హైదరాబాద్‌లో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..

హైదరాబాద్ నగరంలో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 26 Jun 2025 11:25 AM IST

హైదరాబాద్‌లో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..

హైదరాబాద్ నగరంలో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్ లైన్ లో వీడియోలను అప్లోడ్ చేస్తున్న జంటను అంబర్‌పేట్‌లో టాస్క్‌పోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌లో తమ న్యూడ్‌ వీడియోలను దంపతులు స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులు ఇచ్చిన వారికి స్ట్రీమింగ్‌ లింకులు, వీడియోలు పంపుతున్నారు. దంపతుల నుంచి కెమెరా, లైవ్‌ లింక్‌ పరికాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లైవ్ లింకుకు 2000 రూపాయలు, వీడియో చూడడానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారని తేలింది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా న్యూడ్ వీడియోల దందా కొనసాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడి చేసి దంపతుల బాగోతం బట్టబయలు చేశారు.

Next Story