ఆ జంట చేతబడి చేసిందని.. మొదట సజీవ దహనం చేసి..!
Couple killed, bodies burnt over suspicion of witchcraft. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని టోంటో గ్రామంలో ఓ జంటను
By Medi Samrat
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని టోంటో గ్రామంలో ఓ జంటను హత్య చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. నిందితులు ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా వారి మృతదేహాలను కాల్చడానికి ప్రయత్నించారని పోలీసులు సోమవారం తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోకపోవడంతో.. నిందితులు వాటిని అడవిలో పాతిపెట్టేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 20న జరిగింది. ఆ జంట చేతబడి చేసిందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తూ ఉన్నారు. టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్స్ ప్రభావిత బండూ గ్రామానికి చెందిన గోమియా కెరై, అతని భార్యను చంపేసినట్లు గుర్తించారు. ఈ హత్యలో మృతుడి సోదరుడి హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.
భార్యాభర్తలిద్దరూ చేతబడి చేస్తున్నారనే మూఢ నమ్మకంతో గ్రామస్థులు, మృతి సోదరుడు వారికి మత్తు మందు తాగించి ఆ తర్వాత ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత బొండు గ్రామాన్ని నలువైపుల నుండి కవర్ చేసి మరణించిన జంటకు సంబంధించిన మృతదేహాలను వెలికితీసేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. గంటల తరబడి శ్రమించి, గ్రామం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి నుండి గోమియా కెరై, అతని భార్య మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్యపై ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే అదే విధంగా హత్య చేస్తామని గ్రామస్తులను హత్యకు పాల్పడిన నిందితులు బెదిరించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురై పదిరోజుల పాటు ఈ విషయం గురించి చెప్పలేదు. దంపతుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరానికి పాల్పడిన వారిలో గోమియా కెరై సోదరుడు, మరికొంత మంది గ్రామస్తులు ఉన్నారని గుర్తించారు. నిందితులంతా ప్రస్తుతం గ్రామం నుంచి పరారీలో ఉన్నారు. హత్యకు మూఢ నమ్మకాలే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని పోలీసులు రాబడుతూ ఉన్నారు.