రైల్వే ట్రాక్‌పై ఎస్సై మృతదేహం.. ఇంట్లో నిర్జీవంగా భార్య‌, కొడుకు

Cop’s body discovered on railway track. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శ‌నివారం ఓ పోలీసు అధికారి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనుగొనగా

By Medi Samrat  Published on  11 March 2023 9:15 PM IST
రైల్వే ట్రాక్‌పై ఎస్సై మృతదేహం.. ఇంట్లో నిర్జీవంగా భార్య‌, కొడుకు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శ‌నివారం ఓ పోలీసు అధికారి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనుగొనగా.. అతని భార్య, కొడుకు ఇంటిలో నిర్జీవంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ ఖన్‌గూడ (32).. తన భార్య కృష్ణ (28), కొడుకు ఇవా ల ప్రాణాలు తీసిన తర్వాత.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిస్రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌బి శర్మ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3 గంటలకు రైల్వే లైన్‌లపై ఒక వ్యక్తి ఛిద్రమైన మృతదేహం గురించి స‌మాచారం అంద‌డంతో అప్రమత్తమయ్యామని చెప్పారు. ఆ వ్యక్తిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్‌ఐ ఖంగుడగా గుర్తించారు. అగర్ మాల్వాకు చెందిన సురేష్‌ ఖన్‌గూడ 2017లో పోలీసు శాఖలో చేరాడు. కోలార్ ప్రాంతంలోని వారి ఇంట్లో అతని భార్య, బిడ్డ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. ఖన్‌గూడ.. కృష్ణ, ఇవలను పదునైన ఆయుధంతో హతమార్చి, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story