రివాల్వర్‌తో కాల్చుకొని ఎమ్మెల్యే కొడుకు (17) ఆత్మహత్య

Congress MLA's son commits suicide, reason unknown. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 17 ఏళ్ల కొడుకు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మ

By అంజి  Published on  11 Nov 2021 1:36 PM GMT
రివాల్వర్‌తో కాల్చుకొని ఎమ్మెల్యే కొడుకు (17) ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 17 ఏళ్ల కొడుకు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బర్గి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వైభవ్‌ యాదవ్‌ (17) ఇంట్లోని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసు అధికారి అలోక్‌ శర్మ తెలిపారు. రివాల్వర్‌ పేలిన శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. బాత్‌రూమ్‌లో గాయంతో పడి ఉన్న వైభవ్‌ యాదవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్యకు వైభవ్‌ యాదవ్‌ ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేని అదనపు సూపరింటెండెంట్‌ రోహిత్‌ కేశ్వాని తెలిపారు. గన్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారని, రికవరీ తర్వాత మాత్రమే దానికి లైసెన్స్‌ ఉందా? లేదా అన్న విషయం తెలుస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. ఎమ్మెల్యే దగ్గరికి ఆ పార్టీ నేతలు, పలువురు చేరుకొని సంతాపం తెలుపుతున్నారు.

Next Story
Share it