అతడో కాలేజీ స్టూడెంట్.. మహిళ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి మరో మహిళతో..
College student arrested for blackmailing women. అతడొక స్టూడెంట్.. చదువుకోవాల్సిన వ్యక్తి మహిళలను బెదిరించడమే పనిగా
By Medi Samrat
అతను తనను తాను మోడల్ అని.. తనను 'ప్రతీక్ష బోరా' అని పరిచయం చేసుకున్నాడు. పలువురితో మోడలింగ్ అవకాశాల గురించి పోస్ట్ చేశాడు. కాంటాక్ట్‌గా తన సెల్‌ఫోన్ నంబర్ ఇచ్చాడు. అవకాశం కోసం వెతుకుతున్న అమ్మాయిలు అతని ప్రకటనలకు స్పందించి అతనికి ఫోన్ చేశాడు. అతను అందమైన మహిళల గురించి వెతుకుతూ వెళ్ళాడు. వారితో మాటలు కలిపి మోడలింగ్‌లో చేరాలని సూచించాడు. అందుకు కొందరు మహిళలు ఒప్పుకున్నారు. అయితే మహిళలు తమ బోల్డ్ ఫోటోలను అందించాలని కోరాడు. అలా చేస్తేనే ఆఫర్స్ వస్తాయని, వారు పంపిన ప్రతి ఫోటోకు రూ.2,000 చెల్లించాలని కూడా ఆఫర్ చేశాడు. అలాగే బికినీలో ఉన్న ఫోటోకి రూ.10,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అతడు తన నిజ స్వరూపం బయట పెట్టాడు. ఫోటోలను మార్ఫింగ్ చేస్తానని, ఇంటర్నెట్ లో అశ్లీల వెబ్సైట్లలో పెడతానని.. లేదంటే తాను చెప్పిన డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు.