కాలేజీ విద్యార్థినికి ఆటో డ్రైవర్ వేధింపులు.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లాడు

College girl molested, dragged 500 metres by auto driver in Maharashtra's Thane. అక్టోబరు 14, శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల మహిళను

By Medi Samrat
Published on : 15 Oct 2022 3:21 PM IST

కాలేజీ విద్యార్థినికి ఆటో డ్రైవర్ వేధింపులు.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లాడు

అక్టోబరు 14, శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల మహిళను ఆటో రిక్షా డ్రైవర్ వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళను తన వాహనంతో లాక్కుపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితురాలు కళాశాల విద్యార్థిని, ఆమె కాలేజీకి వెళ్తుండగా నిందితులు ఏ మాత్రం భయం లేకుండా వేధింపులకు పాల్పడ్డాడు.

సీనియర్ ఇన్‌స్పెక్టర్ జైరాజ్ రాణావేర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ ఆమెపై కామెంట్లు చేశాడు. అందుకు ఆమె ప్రతిస్పందించగా.. అతడు ఆమె చేయి పట్టుకుని లాగాడు. ఆటో నడుపుతూనే నిందితుడు మహిళను అతడు పట్టుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. వాహనంతో పాటు మహిళను దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీ రికార్డింగ్‌లో తేలింది. ఆ తర్వాత ఆమెను కిందపడేసి నిందితుడు పారిపోయాడు. ఆటో డ్రైవర్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354, ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం ఫిర్యాదు నమోదు చేసినట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఆటో డ్రైవర్ ను ట్రాక్ చేసి అరెస్ట్ చేసినట్లు స్థానికులు తెలిపారు. నిందితుడిని రాజు గా గుర్తించారు.


Next Story