లైంగిక వేధింపుల‌ను ప్ర‌తిఘ‌టించిన బాలిక‌.. 13 సెకన్లలో 8 సార్లు.. క‌త్తిపోట్ల‌తో విరుచుకుప‌డ్డ ఉన్మాది

Class 8 girl in Bihar stabbed 8 times in 13 seconds for resisting molestation, accused held. బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోపాల్‌గంజ్ జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు పాల్పడే ప్రయత్నాలను ప్రతిఘటించినందుకు ఆమెను ఉన్మాది పలుమార్లు కత్తితో పొడిచాడు.

By అంజి  Published on  23 Dec 2021 8:23 AM GMT
లైంగిక వేధింపుల‌ను ప్ర‌తిఘ‌టించిన బాలిక‌.. 13 సెకన్లలో 8 సార్లు.. క‌త్తిపోట్ల‌తో విరుచుకుప‌డ్డ ఉన్మాది

బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోపాల్‌గంజ్ జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు పాల్పడే ప్రయత్నాలను ప్రతిఘటించినందుకు ఆమెను ఉన్మాది పలుమార్లు కత్తితో పొడిచాడు. ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. ఈ సంఘటన డిసెంబర్ 19న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే తన సహచరులతో కలిసి దాక్కున్న ఓ నిందితుడు అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. నిందితులు బాధితురాలిని 13 సెకన్లలో ఎనిమిది సార్లు కత్తితో పొడిచినట్లు తెలిసింది.

ఈ సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్, సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఒక వ్యక్తి అతన్ని లాగడానికి ప్రయత్నించినప్పుడు కూడా నిందితుడు అమ్మాయిని పదేపదే కొట్టడం చూపిస్తుంది. బాలికను గోపాల్‌గంజ్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో నిందితులు పలుమార్లు వేధించేందుకు ప్రయత్నించారని తెలిసింది.

Next Story
Share it