శుక్రవారం మధ్యాహ్నం నందా నగర్ ప్రాంతంలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన తోటి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో మృతుడి స్నేహితుల్లో ఇద్దరు గాయపడ్డారు. ప్రాథమిక విచారణలో అదే పాఠశాలకు చెందిన బాలికతో స్నేహానికి సంబంధించి మైనర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాధితుడు శుక్రవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి మార్కుషీట్‌లు సేకరించేందుకు పాఠశాలకు వెళ్లగా అక్కడ మరో విద్యార్థితో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్య గొడవ జరగడం గమనించిన స్కూల్ సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరాడు.
దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు విద్యార్థులు సుగ్నీదేవి మైదానానికి వెళ్లారు. తిట్టుకోవడం కాస్తా గొడవగా మారింది. నిందితులు బాధితుడిపై దాడి చేసి అతని మెడపై కత్తితో పొడిచారని పరదేశిపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పంకజ్ ద్వివేది మీడియాకి చెప్పారు. బాధితుడి స్నేహితులు ఇద్దరు దాడిని ఆపడానికి ప్రయత్నించారని.. వారి వెనుక మరియు చేతులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చేరారని ద్వివేది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రధాన నిందితుడిని సాయంత్రానికి అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరదేశిపురా పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 302, ఐపిసిలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.