ఆన్‌లైన్ పోర్టల్‌లో లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్నప్పుడు.. తన మాజీ భార్యకు నిప్పంటించిన కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆ వ్యక్తికి ఉరి శిక్ష విధించారు. ఈ ఘటన చైనాలో జరిగింది.. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు టాంగ్ లూ అనే వ్యక్తి తన కుటుంబాన్ని కలవడానికి చివరిసారిగా అనుమతించబడ్డాడని ది గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
సెప్టెంబర్ 2020లో, టిక్‌టాక్ లాంటి.. వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన 'డౌయిన్‌లో' సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్నప్పుడు .. మాజీ భార్యకు నిప్పంటించాడు. లాము అని పిలువబడే ఆ మహిళ కొన్ని వారాల తర్వాత కాలిన గాయాలతో మరణించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. సదరు వ్యక్తి గతంలో భార్యను శారీరకంగా వేధించినట్లు చరిత్ర ఉంది. జూన్ 2020లో ఈ జంట విడాకులు తీసుకున్నారని చైనీస్ స్టేట్ మీడియా నివేదించింది. అతను ఆమెను వెతికి ఆ తర్వాతి నెలల్లో తనను మళ్లీ పెళ్లి చేసుకోమని కోరాడు, కానీ ఆమె తిరస్కరించింది.
లాము తన రోజువారీ జీవితంలోని విషయాలను, సిచువాన్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన చిన్న వీడియోలను డౌయిన్‌లో ప్రసారం చేస్తూ ఉండేది. టిబెటన్ మూలానికి చెందిన మహిళ, ఆమె తరచుగా వీడియోలలో సాంప్రదాయ టిబెటన్ దుస్తులను ధరించేది. ఘటన జరిగిన రోజు లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా వెనుక లూ కనిపించి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతన్ని వెంటనే అరెస్టు చేశారు. అక్టోబర్ 2021లో మరణశిక్ష విధించబడింది. అతను జనవరి 2022లో క్షమాభిక్ష పెట్టుకున్నప్పటికీ.. తాజాగా న్యాయస్థానం ఆ అప్పీల్ ను తోసిపుచ్చింది.